సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్

  • పవన్ కల్యాణ్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్
  • పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి
  • ఆయన గొప్పదనం, వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి చెబుతానని వ్యాఖ్య
  • పదవులు కాదు, వ్యక్తిత్వమే ముఖ్యమని నిరూపించిన వ్యక్తి పవన్ అని కితాబు
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తనకున్న ప్రగాఢ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. ఆ రోజు వచ్చినప్పుడు పవన్ గొప్ప మనసు, వ్యక్తిత్వం గురించి తనకు తెలిసిన నిజాలను ప్రపంచం ముందు గర్వంగా చెబుతానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ సార్ గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన క్యారెక్టర్‌ను, ఆయన నైజాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను. పదవులు, హోదాలు కాదు.. మనిషి విలువ అతని ప్రవర్తన, మాట, మనసులో ఉంటుందని నిరూపించిన వ్యక్తి ఆయన" అని ప్రశంసించారు.

అలాంటి మహోన్నత వ్యక్తి గురించి తన హృదయంలో ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచే ఆ క్షణం కోసం వేచి చూస్తున్నట్లు బండ్ల గణేష్ తన వ్యాఖ్యల్లో తెలిపారు. పవన్ కల్యాణ్ పట్ల బండ్ల గణేష్ కు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సందర్భాల్లో ఆయన పవన్ ను దేవుడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ ఇవాళ నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన సందర్భంగా బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశారు. 

Bandla Ganesh
Pawan Kalyan
AP Deputy CM
Jindal Waste to Energy Plant
Naidupeta
Telugu Cinema
Actor
Producer
Political News
Andhra Pradesh

More Telugu News